News Hunter : నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సుబ్బానాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యమేలమని భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు పాలన అందించకుండా చిరుద్యోగులపై ప్రతాపం చూపడం దారుణమన్నారు. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ అధికార పార్టీ నేతలు సమావేశం పెట్టించి ప్రమీలను తొలగించాలని చెప్పడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.
