ADS

header ads

ఉత్తరాంధ్ర వెనుకబాటును సహించం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా బుధవారం పవన్‌ కల్యాణ్‌ పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో పర్యటించారు. భూ దోపిడీలు, అన్యాయాలు జరగకూడదనే 2014 ఎన్నికల సమయంలో తెదేపాకు ప్రచారం చేశానన్నారు. అధికారంలోకి వచ్చాక తెదేపా మాట తప్పిందన్నారు. ముదపాకలో రాత్రికి రాత్రి జీడిచెట్లు కూల్చి భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. ఇక్కడి భూముల వ్యవహారంపై సిట్ నివేదిక ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. భూముల దోపిడీలో ఎంతటి వ్యక్తులున్నా వెనుకడుగు వేసేది లేదన్నారు. ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక ఉద్యమం పుట్టుకొస్తుందని ఇప్పటికే సీఎంకు చెప్పానని పవన్‌ గుర్తు చేశారు. డబ్బులు కోసం అవినీతికి పాల్పడే అవసరం లేదన్నారు. డబ్బులు కావాలంటే సినిమాలు చేసుకుంటానన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వైకాపా నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను వారిలా కాదని, అధికారంతో పనిలేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానన్నారు. తొలుత పవన్‌ కల్యాణ్‌ ముదపాకలోని భూములను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Post a Comment

0 Comments