నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని చెముడుగుంట లో జిల్లా సైన్స్ కేంద్రం నందు జిల్లా సైన్స్ అధికారిని వి. రాధరాణి ఆద్వర్యం లో 26 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2018 పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ శాస్త్రవేత్త డా|| జగదీష్ పాల్గొన్నారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలల నుండి 233 ప్రాజెక్టులతో విద్యార్థులు పాల్గొన్నారు.వీరిలో 13 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేయబడిన వారిని డిసెంబర్ 2,3 తేదీలలో గుంటూరు లోని కె ఎల్ యూనివర్సిటీ లో జరుగు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫతేఖాన్ పేట ఎస్ బిఐ చీఫ్ మేనేజర్ షేక్ సందాని బాషా,కేర్ డెంటల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా || ఏ స్వరూప్ కుమార్ రెడ్డి, వెంకటచలం మండలం విద్యా శాఖ అధికారి భక్తవర్సలం,విద్యార్థులు సైన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments