న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది. గతవారం రూ.32వేల దిగువకు పడిపోయిన బంగారం ఈరోజు మరో రూ.290కి తగ్గింది. దీంతో ఈరోజు నాటి మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.31,560 గా ఉంది. వెండి కూడా ఈరోజు బంగారం దారిలోనే పయనించింది. రూ. 200 తగ్గడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,100గా ఉంది.

0 Comments