పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై ఉద్యోగాలకు వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ఎస్సై ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో మార్పులు చేసింది. వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతేడాది ఎస్సై ఉద్యోగాలకు 27ఏళ్ల వరకు వయో పరిమితిని సడలించారు. అయితే ఈ యేడాది 25 యేళ్లకు కుదించి నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో దీనిపై అభ్యర్థులు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దీంతో అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని డీజీపీ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి స్పందించిన ప్రభుత్వం పోలీసు నియామకాల్లో అభ్యర్ధులకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.

0 Comments