నెల్లూరు జిల్లా,చిత్తూరు జిల్లా మరియు వివిధ ప్రాతాలలో చైన్ స్నాచింగ్, కారు అద్దాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న కప్పరాళ్ల తిప్పకు చెందిన 5 మందిని దొంగల ముఠాను నెల్లూరు సిసిఎస్ పోలీస్ లి అన్నయ్య సర్కిల్ దగ్గర రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలిపారు. వీరినుండి 720 గ్రాముల బంగారం 85వేల నగదు 2 బైక్ లు మొబైల్ ఫోన్లు సుమారు 20లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారని తెలియజేసారు. వీరిని పట్టుకున్న పోలీసులకు ఎస్పీ, డిఎస్పీ లు రివార్డులు అందజేశారు.

0 Comments