ADS

header ads

దౌర్జన్యం,అత్యాచార కేసులో వైసిపి కార్పొరేటర్ కు 5ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు

నెల్లూరు : నెల్లూరు లోని 53 వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ అశోక్ కు నెల్లూరు జిల్లా 8వ అదనపు కోర్ట్ దౌర్జన్యం మరియు అత్యాచార కేసులో ఈ రోజు 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. వివరాలలోకి వెళితే.. 2014 లో బందుకూరి విజయశ్రీ అనే మహిళా కార్పొరేటర్ మరియు కట్ట అశోక్ ల పై దౌర్జన్యం మరియు అత్యాచార కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన జిల్లా 8వ అదనపు కోర్ట్ జడ్జ్ తీర్పును వెల్లడించారు. అత్యాచారం చేశారన్న రుజువు లేకపోవడం తో ఆ కేసును కొట్టేశారు. అయితే దౌర్జన్యం చేశారని రుజువు కావడంతో కార్పొరేటర్ దేవరకొండా అశోక్ కు  5 ఏళ్ళు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే కట్ట అశోక్ కు 10వేలు రూపాయలు జరిమానా విధించారు.

Post a Comment

0 Comments