ఉత్తర ప్రదేశ్ - కాన్పూర్: కట్నం కోసం జరిగిన గొడవలో ఓ భర్త తన భార్య నాలుకను కోసేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో జరిగింది. ఈ గొడవకు 10 రోజుల ముందు నుంచి భార్యను ఆమె భర్త కట్నం కోసం గృహ నిర్బంధం చేశాడని, విషయం తెలిసిన ఆమె తండ్రి బాధితురాలిని విడిపించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వివరించారు. ఈ ఘటనలో భర్త ఆకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.మరోవైపు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు.నిందితుడి తండ్రి పోలీసు కావడంతో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. దీంతో నిందితుడ్ని తక్షణం అరెస్టు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.
0 Comments