ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణికి ధన్యవాదాలు చెప్పారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘2.ఓ’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో భారత్‌లోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుంటోంది. నవంబరు 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్‌ను శనివారం ఉదయం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది.
ఈ సందర్భంగా రెహమాన్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలోని ఓ పాటను కీరవాణి పాడినట్లు తెలిపారు. ‘కీరవాణి గారు.. తెలుగు ‘2.ఓ’లోని ‘బుల్లిగువ్వ’ పాటను పాడినందుకు ధన్యవాదాలు. రేపు విడుదల కాబోయే ప్రచార చిత్రం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

0 Comments