జనసేన లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..ఇప్పటికే పలువురు సీనియర్ మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకోగా , తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలరాజు జనసేన పార్టీ లో చేరారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఈయన..తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన లో చేరారు.
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పసుపులేటి బాలరాజు కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ. పవన్ పర్యటన ద్వారా గిరిజనులు ఎలా దోపిడీకి గురవుతున్నారో బయటకి తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఎలా దోపిడీకి పాల్పడుతోంది అనేది పవన్ ప్రశ్నిస్తున్నారని. పవన్ తో పాటు కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని తెలిపి కార్య కర్తల్లో మరింత ఉత్సహం నింపారు.

0 Comments