అల్లు అర్జున్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మలయాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన సినిమా విడుదలైందంటే. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ సందడి వాతావరణం ఉంటుంది. బన్ని నటించిన సినిమాలు మలయాళం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఇటీవల కేరళ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా రూ.25 లక్షల ఆర్థిక సాయమందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. దాంతో రియల్ హీరోగాను బన్నీ మలయాళ అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
నవంబర్ 10న కేరళ ప్రభుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వహిస్తుంది. అలప్పిలోని మాడ లేక్‌లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు తలపడతాయని సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేరళ ప్రభుత్వం అక్కడ జరగబోయే పడవల పోటీలకు ప్రత్యేక అతిథిగా బన్నీని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపించినట్టు తెలుస్తోంది. ఈ పడవల పోటీ కేరళలో ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దాదాపు 65 ఏళ్ల నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి.

0 Comments