News Hunter : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తేనుంది. కాన్‌సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్, గ్రూప్ కాల్ షార్ట్‌కట్ పేరిట ఈ రెండు ఫీచర్లు త్వరలో లభ్యం కానున్నాయి. కాన్‌సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్ సాయంతో యూజర్లు తమ వాట్సాప్‌కు వచ్చే వాయిస్ మెసేజ్‌లను ఒకదాని వెంట ఒకటి వరుసగా ప్లే చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ కాల్స్‌ను మరింత సౌకర్యవంతంగా చేసుకునేందుకు వాట్సాప్‌లో గ్రూప్ కాల్ షార్ట్‌కట్ బటన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్‌లలో వాట్సాప్ యూజర్లకు ఇప్పటికే లభిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

0 Comments