ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి..వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి డేట్ ఫిక్స్ చేసారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డి మనవడితో ఆశ్రిత పెళ్లి జరగబోతుంది. కొంతకాలం గా ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు.
ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు నవంబర్ 24 న ఆశ్రిత పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట. సమయం తక్కువగా ఉండడంతో ఇప్పటికే ఇరుకుటుంబాల్లో పెళ్ళి హడావుడి మొదలైందట. ఈ వివాహ వేడుకకు అన్ని ఇండస్ట్రీ సినీ ప్రముఖలతో పాటు బిజినెస్ రంగాల పెద్దలు సైతం హాజరు కాబోతున్నారట. ఇక వరుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం వెంకీ , వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

0 Comments