ADS

header ads

త్వరలో పెళ్లి పీట‌లు ఎక్కనున్న శ్వేతా బసు..

News Hunter : ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యువతను కొత్త ప్రపంచంలోకి తీసికెళ్ళిన శ్వేతా బసు త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. శ్వేతా బసు చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో ప్రేమలో పడిన సంగ‌తి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ ల‌వ్ బ‌ర్డ్స్ రెండేళ్ళ నుండి క‌లిసి జీవిస్తున్నారు.
ఈ ఏడాదిలో జూన్‌లో వీరి నిశ్చితార్ధం ఘ‌నంగా జ‌రిగింది. డిసెంబ‌ర్ 13న వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి శ్వేతా అడుగు పెట్టింది. సినిమాల్లో ఆమె నటనకు పలు నేషనల్ అవార్డులు వరించాయి. శ్వేతా రీసెంట్‌గా స్నేహితులతో కలిసి బ్యాచిల‌ర్ పార్టీ కూడా జ‌రుపుకుంది. పూణేలో రోహిత్‌, శ్వేతల వివాహం జ‌రుగనుండగా, ముంబైలో రిసెప్ష‌న్ జ‌రుపుకోనుంద‌ట‌.

Post a Comment

0 Comments