ADS

header ads

గూడూరు మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన మంత్రి నారాయణ

గూడూరు మునిసిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులపై సమీక్షించి.,పలు పథకాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. 8వ వార్డులో నూతన హంగులతో నిర్మించిన చేపల మార్కెట్ ను ప్రారంభించారు. అనంతరం  పోస్టాఫీసు వద్ద నిర్మించిన "అన్నా క్యాంటీన్" భవనాన్ని ప్రారంభించి.   పేద ప్రజలు ఎమ్మెల్యే,ఛైర్ పర్సన్,కౌన్సిలర్లు,అధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేశారు.ఎమ్మెల్యే వినతి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోని రూరల్ పరిధిలో మరో అన్నా క్యాంటీన్ మంజూరు చేశారని తెలియజేసారు.  మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు గాను మరో 10-కోట్ల రూపాయలను మంజూరుచేస్తానని,ఇంతకుముందు ఇచ్చిన నిధులను ఖర్చు చేయాలని కౌన్సిల్ సభ్యులకు సూచించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణను చంద్రబాబు నాయుడు  ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, రోజుకు ఒక మనిషికి నాణ్యమైన ఆహారాన్నిఅందించాలని మూడు పూటల భోజనానికి కలిపి నిర్వాహకులకు 73-రూపాయలు చెల్లిస్తున్నామని.,ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని సభాముఖంగా తెలిపిన మంత్రి నారాయణ,ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్,ఛైర్ పర్సన్ ధేవసేన,వైస్ ఛైర్మన్ కిరణ్, కమీషనరు,కౌన్సిలర్లు,పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు,కిషోర్ నాయుడు,అజిత్ రెడ్డి,వెంకటేశ్వర్లు రాజు, Zptcలు-వేనాటి రామచంద్రారెడ్డి,పద్మ,విజేత, ప్రమీల,భారతి,శ్రావణి,జీవని,పార్టీనాయకులు.ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments