ADS

header ads

ఆకట్టుకుంటున్న సరికొత్త పల్సర్‌ నియాన్‌..!

News Hunter:బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సరికొత్త పల్సర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్‌ 150 నియాన్‌ను గురువారం విడుదల చేసింది. దిల్లీలో దీని ఎక్స్‌ షోరూం ధర రూ.64,998గా కంపెనీ నిర్ణయించింది. నియాన్‌లో సరికొత్త హెడ్‌ల్యాంప్‌ బ్రౌస్‌, బ్యాడ్జెస్‌, సైడ్‌ప్యానెల్‌ మెష్‌, గ్రాబ్‌ రెయిల్‌ వంటివి అమర్చారు. '' 100 సీసీ, 110 సీసీ దాటి మరో సెగ్మెంట్లోని వాహనం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు నియాన్‌ ఒక మంచి ఎంపిక. '' అని బజాజ్‌ ఆటో మోటార్‌ సైకిల్‌ విభాగం అధ్యక్షుడు ఎరిక్‌ వాజ్‌ తెలిపారు.
నియాన్‌లో 149సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8000 ఆర్‌పీఎం వద్ద 14బీహెచ్‌పీ శక్తిని, 13.4ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ముందుభాగంలో 240 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ , వెనుక చక్రానికి 130 ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ను అమర్చారు. ఈ వాహనంలో ఏబీఎస్‌ వ్యవస్థ లేదు. మిగిలినవన్ని సంప్రదాయ పల్సర్‌ డిజైన్‌ పోలిఉంటాయి. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments