News Hunter : తెలంగాణ రాష్ట్రంలో 103నుంచి 106 స్థానాల్లో గెలవడం ఖాయమని తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ అన్నారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ. టీఆర్ఎస్ కు 103 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. టీఆర్ఎస్ గెలవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయన్నారు. రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఇంకా తెలంగాణకు వలసవాదుల పాలన అవసరమా అని ప్రశ్నించారు. రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని కేసీఆర్ తాండూరు సభలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టికెట్లు అమ్ముకుందని తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఎన్నికల్లు వస్తుంటయి.. పోతుంటయి. కానీ మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు. 40ఏళ్ల పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన టీడీపీ కంటే..వాళ్లు చేయని పనులు కూడా నాలుగున్నరేళ్లలో చేశామన్నారు.

0 Comments