ADS

header ads

గాలి జనార్దనరెడ్డి అరెస్టు

మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డిని సిసిబి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు ఏకధాటిగా గాలిని విచారించిన సిసిబి పోలీసులు ఆదివారం ఉదయం 9 గంటల నుంచే మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ విచారణకు హాజరైన అంబిడెంట్‌ ఎండీ ఫరిద్‌, జనార్థన్‌రెడ్డి పిఏ అలీఖాన్‌ను బయటకు పంపినా జనార్ధన్‌ రెడ్డిని సిసిబి కార్యాలయంలోనే ఉంచారు. సుదీర్ఘ విచారణ అనంతరం గాలిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు. విచారణ ప్రక్రియను 300 పేజీల్లో రాతపూర్వకంగా, వీడియాఓ చిత్రీకరణ ద్వారా భద్రపరిచారు. అనంతరం ఐపిసి 120బి, 201 సెక్షన్ల కింద గాలిని అరెస్టు చేశారు. కేసును దారి తప్పించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన అభియోగంపై గాలిని అరెస్టు చేసినట్లు సమాచారం.

Post a Comment

0 Comments