ADS

header ads

అప్పుల్లో తెలంగాణ.. గట్టేక్కిన ఏపి.. ఆర్బీఐ గణాంకాలు వెల్లడి

News Hunter: రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై ఆర్బీఐ వెలువరించిన తాజా నివేదికలో తెలుగు రాష్ట్రాలపై ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోతుండగా. తీవ్ర ఆర్ధిక నష్టాలను దిగమింగుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ క్రమంగా అప్పులనుంచి బయటపడుతోంది. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 201718 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ. 201617 ఆర్ధిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఖరాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలు: ఆదాయ వ్యయాలపై అధ్యయనంగ పేరుతో. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెలువరించింది. రుణమాఫీలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీసే మితిమీరిన అప్పుల కారణంగా పలు రాష్ట్రాలు ఆర్ధిక ఒత్తిడికి గురవుతున్నాయని కేంద్రీయ బ్యాంకు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments