స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ రాష్ట్రంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు లో ఏ హీరో కు దక్కని అభిమానం బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆర్య సినిమాతో కేరళ లో బన్నీ కి అభిమానులు అయ్యారు. ఇక ఆ సినిమా నుండి మొదలు పెడితే నిన్నటి నా పేరు సూర్య వరకు అభిమానులు పెరుగుతూ వచ్చారు. తమిళ్ హీరోకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు రెట్టింపుగా ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు బన్నీ కి. దీనిని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం బన్నీ కి ప్రత్యేక ఆహ్వానం పలికింది.
ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరోకు దక్కని గౌరవం ఇది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రు ట్రోఫీ బోట్ గేమ్స్ కు ప్రత్యేక అథిదిగా బన్నీ హాజరయ్యారు. దీనికోసమే సతీసమేతంగా కేరళకు వెళ్లాడు బన్నీ. అక్కడి కొచ్చి ఎయిర్ పోర్ట్‌లో దిగీ దిగగానే బన్నీకి ఘన స్వాగతం లభించింది. అల్లు అర్జున్ వస్తున్నడని తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు.. ఆయనకు స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్ట్ అంత బన్నీ బ్యానర్లు నిండిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. బన్నీని మరింత ఉత్సాహ పరిచారు.
ఎయిర్ పోర్ట్ అంత బన్నీ బ్యానర్లు నిండిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. బన్నీని మరింత ఉత్సాహ పరిచారు.

0 Comments