హైదరాబాద్‌ను బంగారుమయం చేసి అందిస్తే.. కేసీఆర్ పాలించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని డేగరమూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు .
ధర్మపోరాట దీక్షలు ఏర్పాటు చేసి విభజన హామీలను నెరవేర్చమని అడిగినందుకే కేంద్ర ప్రభుత్వం దాడికి దిగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను రెచ్చగొడితే ఏమైందో ఇప్పటికే వారికి అర్థమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, రాజ్యాంగబద్ధ సంస్థలను, స్వతంత్ర సంస్థలను భ్రష్టుపట్టించడాన్ని చూశాక ఓ సీనియర్ నేతగా తాను కూర్చుంటే లాభం లేదని భావించానని.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా జాతీయ పార్టీలను ఏకం చేసేందుకు ముందుకొచ్చానన్నారు.

0 Comments