News Hunter: హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై రౌడీషీటర్ అయిన తండ్రి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. 13సంవత్సరాల తన కూతురుపై సయీద్ ఖాజా అనే రౌడీషీటర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే... ఈ విషయాన్ని బాలిక చదువుకుంటున్న పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం విషయం ఎస్ఆర్ నగర్ పోలీసులకు తెలియడంతో వారు సయీద్ ఖాజాను అదుపులోకి విచారిస్తున్నారు. అలాగే ఖాజాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

0 Comments