ADS

header ads

కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి చెందగా , 10మంది తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే. హుబ్లి సమీపంలోని 43వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో కర్ణాటక నుంచి ముంబై వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను విశ్వనాథ్(76), దినకర్(74),రమేశ్ జైపాల్(70),సుమేధ(65),లహు(65),సుచిత్ర(65)గా పోలీసులు గుర్తించారు. మరో 10మంది తీవ్ర గాయాలు కావడం తో వెంటనే వారిని హుబ్లి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Post a Comment

0 Comments