ఖమ్మం: తాను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియప్రాంతమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనను తెలంగాణ ప్రజలంతా ఎంతో అభిమానించారని, ఎవరికీ దక్కని గౌరవం తనకు ఇచ్చారని.. దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనన్నారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్, తెదేపా ఒకరిపై మరొకరు పోరాటం చేసినా దేశ ప్రయోజనాల కోసమే ఈ రోజు ఏకమయ్యామన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే.. తనపై కేసీఆర్, తెరాస చేసిన విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.''ప్రజల ఉత్సాహం చూస్తుంటే నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్టుంది. వేదిక పంచుకోవడం ఇదో చారిత్రక అవసరం. ఈ సమావేశం చరిత్రలో మిగిలిపోతుంది. దేశస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీయేకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ కూటమితో అందరం కలవాలనే ఉద్దేశంతో అందుకు నాంది తెలంగాణలో ప్రజాకూటమితో ప్రారంభించాం. దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. లేకపోతే మనమెవరం మనుగడ సాధించలేం. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్‌బీఐ, గవర్నర్ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు.
నేనేదో పెత్తనం చేస్తానంటున్నారు. ఈ రోజు నేను తెలంగాణకు వచ్చి పోటీచేసే అవకాశం లేదు. నేనే ఏపీకి సీఎంగా ఉంటాను. తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా. గోదావరి జలాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది ఆనాడు ఆలోచించాం. కృష్ణానదిలో నీళ్లు రాలేదు. గోదావరి 2500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. దాన్ని ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి. తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు? దేవాదుల, మాధవరెడ్డి ఎత్తిపోతల, భీమ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నేనే నాంది పలికాను. తెలుగుజాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తా. విద్యకు నేనే ప్రాధాన్యమిచ్చాను. హైదరాబాద్‌ను నేనే నిర్మించాని చెప్పుకొంటున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని ఎక్కడా అనలేదు. సైబరాబాద్‌ను నేనే నిర్మించా'' అని చంద్రబాబు వివరణ ఇచ్చారు.

0 Comments