ఆస్తికోసం మానవత్వాన్నే మరిచిపోయాడు ఓ భర్త. భార్యను పరమ పైశాచికంగా చిత్ర హింసలు పెట్టాడు. పాంపం పండాక చివరికి జైలు పాలయ్యాడు ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలా పురంలో చోటు చేసుకుంది. అందరిలాగే ఆమె ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. భర్త తోడుగా జీవితం అందంగా సాగుతుందని కలలు కన్నిది. కానీ భర్త దేవీ రమణ కుమార్ ఆమెకు భూమ్మీదే నరకం ఎలా వుంటుందో చూపించేశాడు.
ఆమెను మేనత్త పెంచి పెద్ద చేసింది. కొంత కాలానికి కాలం చేసింది. కానీ ఆమె పేరు మీద కొంత ఆస్తి వుంది. దాంతో ఆమె కష్టం మొదలైంది. ఆ ఆస్తి తన పేరు మీద రాసివ్వాలంటూ భర్త దేవి రమణ కుమార్ వేధించటం మొదలు పెట్టాడు. భార్యను గదిలో బంధించి మర్మాయవాన్ని కత్తిరించాడు. రక్తశ్రావం అవుతున్నా ఆ భర్త మనసు చలించలేదు. యింకెన్నో వికృత చేష్టలు చేయడం మొదలెట్టాడు. వాటన్నింటిని ఆమె మౌనంగా భరించింది.. సహించింది. భర్తతో పాటు అత్తమామలు కూడా అదనపు కట్నం కింద రూ.ఐదులక్షలు తీసుకురావాలని నిత్యం శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టేవారు.
అన్ని బాధలు భరించి కానీ ఆస్తికోసం కన్నబిడ్డను చంపుతానని భర్త బెదిరించడంతో భయపడిపోయింది. మాతృహృదయం సహించలేకపోయింది. దాంతో భర్త అత్తమామలు చేసిన అకృత్యాలపై బాధితురాలు అమలాపురం పట్టణ పోలీసలుకు ఫిర్యాదు చేసింది. దీంతో నరరూప రాక్షసుడైన భర్త కోటిపల్లి దేవి రమణ కుమార్ ని మామ సుబ్బారావులను సిఐ శ్రీరామ కోటేశ్వరరావు అరెస్టు చేశారు. బాధితురాలు ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రి చికిత్స పొందుతోంది.

0 Comments