జపాన్.. చిన్న దేశమే కానీ... ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ప్రపంచం ముందు నిలబడింది. భయంకరమైన సునామినీ తట్టుకొని ప్రపంచానికి సవాల్ విసిరింది. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా జపాన్‌ను ఆత్మహత్యలు పట్టి పీడిస్తున్నాయి. జపాన్ వాసులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారట. దీంతో ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయిందట. అందులోనూ సోమవారం రోజున ఉదయం ఎక్కువగా ఆత్మహత్యలు నమోదవుతున్నాయట. దాంట్లో మధ్యవయస్సులో ఉన్న పురుషులు సూసైడ్ చేసుకుంటున్నారట. అంటే 40 నుంచి 65 మధ్య వయసు ఉన్న వాళ్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. వాళ్లలో చాలామంది సోమవారం ఉదయం జాబ్‌కు వెళ్లడానికి ముందు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా జపాన్ ఆర్థిక స్తబ్దత, ఎక్కువ ఆత్మహత్యలతో సతమతమౌతోంది. అయితే... జపాన్‌లో చాలా వరకు కంపెనీలు ఉదయం పూట వర్కింగ్ అవర్స్‌ను పెట్టుకోవడం కూడా ఈ సూసైడ్లకు కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు సాయంత్రం పూట వర్కింగ్ అవర్స్‌ను నిర్వహిస్తాయట. ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే వాళ్లే ఈ ఆత్మహత్యల బారిన పడుతున్నట్టు రీసెర్చర్స్ చెబుతున్నారు.అయితే వాళ్లు పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారా లేక ఉదయం పూట జాబ్‌కు వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నారా అనే కోణంలో పరిశోధన చేస్తున్నారట పరిశోధకులు.

0 Comments