ADS

header ads

ఎయిర్‌టెల్ నుంచి సరికొత్త ప్లాన్.. జియో కి పోటీ..!

ఇండియాలో రెండవ అతి పెద్ద టెలికాం దిగ్గజంగా పేరు గాంచిన ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 398 ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రూ. 398కి పోటీగా నిలవనుంది. ఈ రూ. 398 ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 1.5 జిబి డేటాని యూజర్లు అందుకోనున్నారు.కాగా ఈ ప్లాన్లో ఎటువంటి FUP లిమిట్ లేదు.కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజలు వరకు ఉంటుంది. ఈ 70 రోజుల వ్యవధిలో వినియోగదారులు 105 జజిబి డేటాను అందుకుంటారు.
ఈ కొత్త ప్లాన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంది...
టెలికాం టాక్ రిపోర్టింగ్ ప్రకారం ఈ కొత్త ప్లాన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంది.దీంతో పాటు వినియోగదారులు రూ.399 ప్లాన్ ని కూడా పొందవచ్చు. దీని ద్వారా రోజుకు 1.4 జిబి డేటా, 100 ఎసెమ్మెస్ లును 84 రోజుల పాటు వాడుకునే వీలుంది.
రిలయన్స్ జియోలో...
కాగా ఇదే ప్లాన్ ప్రకారం రిలయన్స్ జియోలో రోజుకు 2జిబి డేటా, రోజుకు 100 ఎస్మెమ్మెస్ లు,అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజుల వరకు ఉంటుంది.
వొడాఫోన్ లో కూడా ఉంది....
ఈ రకమైన ప్లాన్ వొడాఫోన్ లో కూడా ఉంది. ఇందులో రోజుకు 1.4 జిబి డేటా అన్ లిమిటెడ్ కాలింగ్తో పాటు డైలి కాల్స్ లిమిట్ 250 నిమిషాల వరకు ఉంటుంది.
ఇదిలా ఉంటే రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 4జీ నెట్‌వర్క్‌తో పాటు 3జీలోనూ ఎయిర్‌టెల్ టాప్‌లో నిలిచింది.
అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా తొలి స్థానం సంపాదించినట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో 4జీ నెట్‌వర్క్ కవరేజ్ పరంగా చూస్తే రిలయన్స్ జియో టాప్‌లో ఉందని మొబైల్ అనలిటిక్స్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ తాజా నివేదికలో వెల్లడించింది.

Post a Comment

0 Comments