కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని నేనూ.. లోకల్ అంటోంది. సుహాసిని నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై సుహాసిని స్పందించింది. ఇవాళ ఎన్ టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. నేను లోకల్ నే. పదవ తరగతి నుంచి పీజీ వరకూ కూకట్ పల్లిలోనే చదువుకున్నా. బహుశా.. ఈ విషయం తెలియక తనని నాన్ లోకల్ అంటున్నట్టున్నారని తెలిపింది.
ఇక, కూకట్ పల్లిలో సుహాసినికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ అసంతృప్తి నేతల సంఖ్య చాలా తక్కువ. అసలు లేదనే చెప్పాలి. సుహాసినికి ఏ ఇబ్బంది లేకుండా ముందుగానే టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకొంది. దీనికి తోడు సుహాసిని తరుపున బాలయ్య, ఎన్ టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

0 Comments