ADS

header ads

అందరికీ నమస్కారం. న్యూస్‌ రీడర్‌గా ఇదే నా మొదటి రోజు..

News Hunter : అందరికీ నమస్కారం. న్యూస్‌ రీడర్‌గా ఇదే నా మొదటి రోజు.. అంటూ ఓ న్యూస్‌ ఛానల్‌లో గడగడ వార్తలు చదువుతున్నాడు ఓ వ్యక్తి. అయితే ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారు కదూ. కానీ అక్కడ వార్తలు చదువుతున్నది నిజంగా మనిషి కాదు. కృత్రిమ మేధతో కూడిన న్యూస్‌ యాంకర్‌(ఏఐ న్యూస్‌ యాంకర్‌). చైనాకు చెందిన అధికారిక న్యూస్‌ ఛానల్‌ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ న్యూస్‌ యాంకర్‌తో వార్తలు చదివించింది. ఈ న్యూస్‌ యాంకర్‌ ఏ మాత్రం ఆలసిపోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలను 24 గంటలు.. 365 రోజులూ అందిస్తాడని ఆ ఛానల్‌ సగర్వంగా ప్రకటించింది.

Post a Comment

0 Comments