News Hunter: ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోలీసు అధికారి ఒకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనంపై నుంచి గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల ప్రేమ్ బల్లభ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని సహచరులు తెలిపారు. 1986లో హెడ్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన ఈయన వివిధ హోదాలు దాటి 2016లో ఏసీపీ అయ్యారు.
మానసిక ఒత్తిడి వల్ల బాధితుడు ఇటీవలే 28 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారని పోలీసులు తెలిపారు. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

0 Comments