ADS

header ads

డిఎస్పీ వివాహితతో రాసలీలలు.. రెడ్ హ్యాండెండ్‌గా మీడియాకి పట్టించిన భర్త..?

News Hunter : ఓ వివాహిత‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని మాయ మాట‌లు చెప్పి లొంగ‌దీసుకున్నాడు ఆ డీఎస్పీ. ఆ మ‌హిళ తో రాస‌లీల‌లు న‌డుపున్న స‌హ‌యంలో అమె భ‌ర్త రెడ్ హ్యాండెడ్‌ ప‌ట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న పోలీసు శాఖ‌లో సంచ‌ల‌నం గా మారింది. చిత్తూరు జిల్లా తిరుచానూరు లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కలికిరి గ్రామానికి చెందిన రెడ్డిప్రసాద్‌కు వాయల్పాడుకు చెందిన యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వృత్తి రీత్యా రెడ్డిప్రసాద్‌ హైదరాబాద్‌లోని ఓ సంస్థలో అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ వారికి ఒక డీఎస్పీతో పరిచయం ఏర్పడింది. ఆ డీఎస్పీ తరచూ రెడ్డి ప్రసాద్‌ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఆ ప‌రిచ‌యాన్ని వారి అవ‌స‌రాన్ని ఆ డీఎస్సీ అవ‌కాశం గా మ‌ల‌చుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రెడ్డిప్రసాద్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

 ఈ విషయం తెలుసుకున్న రెడ్డి ప్రసాద్ గ‌తంలోనే హైదరాబాద్‌లోని బూచుపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసాడ‌నే కార‌ణంగాతో డిఎస్సీ రౌడీలను పూరమాయించి రెడ్డిప్రసాద్‌పై దాడి చేయించాడు. కొంత కాలం గ‌డిచిన త‌రువాత డిఎస్పీ మ‌ర‌లా రంగ ప్ర‌వేశం చేసాడు. ఈ సారి టిటిడిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతికి న‌మ్మ‌బ‌లికాడు. ఆరు నెలల కిత్రం భార్య బలవంతం చేయడంతో తిరుచానూరు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి రెడ్డిప్రసాద్‌ కాపురం మార్చాడు. డీఎస్పీ అక్కడికీ వస్తూ పోతూ ఉన్నాడు. భార్యకు ఎంత చెప్పినా వినలేదు. తాజాగా డీఎస్పీ ఇంటికి వచ్చి భార్యతో కలిసి ఉండడాన్ని గమనించిన రెడ్డిప్రసాద్‌ తాళాలు వేసి మీడియాతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు.

మీడియా సాక్షిగా తాళాలు తీయడంతో డీఎస్పీ, వివాహితతో సంబంధం బట్టబయలైంది. మీడియా రాకను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు స్టేషన్‌కు రావాలని చెప్పగా కారులో వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వివాహితను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. డీఎస్పీ ప్రస్తుతం మంగళగిరిలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘ‌ట‌న పై స్థానిక పోలీసులు ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.

Post a Comment

0 Comments