ADS

header ads

ఎన్టీఆర్‌ బయో పిక్ లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్

తెలుగువారి కీర్తిని, ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన నందమూరి తారక రామారావు జీవిత కథను 'ఎన్టీఆర్‌' పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'కథానాయకుడు', 'మహా నాయకుడు' పేర్లతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు.ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. ఇందులో సావిత్రిని నిత్యామీనన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మహానటి సావిత్రి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'గుండమ్మకథ' సినిమాలోని 'లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం' పాట పాడుతూ ఎన్టీఆర్ పెద్ద రోట్లో ఎడమచేత్తో పప్పు రుబ్బుతాడు కదా. కరెక్ట్ గా అదే సీన్. పెద్దాయన పాత్రలో మొరటోడిలా బాలయ్య బాబు ఉత్సాహంగా రుబ్బుతూ పాటేసుకుంటే.. పక్కనే అణకువగా బుల్లెమ్మ సావిత్రి పాత్రలో నిత్య మేనన్ అలా నిలబడి ఉంది. ఈ ఫోటో తెగ ఆకట్టుకుంటుంది.

Post a Comment

0 Comments