ADS

header ads

గూడూరులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ

గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. మంత్రి నారాయణకు
ఎమ్మెల్యే సునీల్ కుమార్*, మున్సిపల్ చైర్ పర్సన్, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రినారాయణమాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్పొరేట్ క్యాంటిన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది అనీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటిన్లను ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 110 మునిసిపాలిటీల్లో 203 క్యాంటీన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటికే 130 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం అనీ మంత్రి తెలిపారు.దేశంలో ఎక్కడాలేని విధంగా కార్పొరేట్ ఫుడ్ కోర్టు తరహాలో అన్న క్యాంటీన్లను రూపొందించాం అనీ.లాభాపేక్ష లేని అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు పేదలకు భోజనాన్నీ రుచిగా,శుచిగాఅందిస్తున్నమన్నారు.పేదవాడు మూడు పూటలా భోజనానికి 15 రూపాయలు చెల్లి స్తుంటే ప్రభుత్వం 58 రూపాయలు చెల్లిస్తున్నదిఅని.రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న కూడా పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదేనని మంత్రి నారాయణ అన్నారు.అనంతరం క్యాంటిన్ లో మంత్రి.ఎమ్మెల్యే భోజనం చేశారు.

Post a Comment

0 Comments