అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో రహదారులు, గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. రాజధానిలో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యతపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు వారంలో మానవ వనరుల లభ్యతను పెంచుతామని సీఎంకు వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు సూచించారు. గృహనిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. జనవరి 19లోగా 1.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

0 Comments