News Hunter: ప్రతిపక్ష నేత జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసే ధైర్యం జగన్ లేదని ధ్వజమెత్తారు. జనసేన ప్రజాపోరాట యాత్ర సభలో పవన్ మాట్లాడారు. పోరాటం చేయకుండా రోడ్లపై తిరిగే జగన్ కావాలో?.. సినీ సంపాదన వదులుకుని పోరాటం చేస్తున్న పవన్ కావాలో..? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజానగరం సభకు వెళ్తుంటే తన కాన్వాయ్‌ని ఇసుక లారీ ఢీకొట్టిందని చెప్పారు. కానీ కోడికత్తి గుచ్చారంటూ జగన్‌లా రాజకీయం చేయలేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసే ధైర్యం జగన్‌కు లేదన్నారు. మోదీని తిడుతున్న చంద్రబాబు అవసరమైతే వైసీపీతోనూ కలుస్తారని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు పట్టు కోల్పోయారని వివరించారు.

0 Comments