నెల్లూరు నగరం లోని బివి నగర్ ప్రాంతం లో 2 వ తేదీ శనివారం సాయంతరం 6 గంటల ప్రాంతం లో ఇతర రాష్ట్రానికి చెందిన యువకులపై మరో ఇద్దరు యువకులు వారిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అదే రోజు దాడి అనంతరం వారు బైక్ పై పారిపోతూ బుజబుజ నెల్లూరు దగ్గర హై వే పై తనికీలు చేస్తున్న వేదాయపాలెం ఎస్ ఐ లను చూసి వెనక్కి పారిపోయే క్రమంలో వారిని పట్టుకున్నామని వేదాయపాలెం ఎస్ ఐ మీడియాకు వివరించారు. సంతోష్ జిందర్ అనే రాజస్థాన్ యువకులు 10 సంవత్సరాలుగా నగరం లో టైల్స్ వర్క్ చేసుకుంటున్నారని 2 వ తేదీ సాయంతరం బీవీ నగర్ లో పానీపూరి తింటున్నారు. అక్కడే పానీపూరి తింటున్న మరో ఇద్దరు యువకులు అశోక్, జమీర్ లు తిన్న అనంతరం అశోక్ ప్లేట్ విసరడం లో జిందర్ పై పడడంతో జిందర్ ఎందుకు నాపై ప్లేట్ వేశావు అని అడగగా నువ్వు ఎవడురా నన్ను అడగడానికి అని దూరుషుగా సమాదం ఇవ్వడం తో ఘర్షణకు చోటుచేసుకుంది జమీర్ తనదగ్గర ఉన్న కత్తితో దాడి చేసాడు అశోక్ కూడా కత్తి తీసుకుని ఆలా కాదు పొడవడం అని రాజస్థాన్ యువకులపై దాడి చేశారని తెలియజేసారు. అశోక్ జమీర్లపై గతం లో కేసులుకూడా ఉన్నాయని తెలియజేసారు. వారిని రిమాండుకి తరలిస్తామని తెలియజేసారు. వారినుండి ఒక కత్తిని యమహా బైక్ ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు.
దానికి ఉపయోగించిన కత్తి


0 Comments