జనసేన కార్యకర్తలకు ఓటు విలువను మరోసారి గుర్తు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఓటు అనే ఆయుధాన్ని మర్చిపోవద్దని.. జాబితాలో పేరు ఉందో లేదో ప్రతివారం చెక్ చేసుకోమని సూచించారు. అనపర్తి జనసేన బహిరంగ సభ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని కొంతమంది నమ్మితే.. ఓటు అనే ఆయధం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని జనసేన నమ్ముతుందని.. అదే జనసేన సిద్ధాంతమన్నారు. ‘‘ఇళ్లకు క్షేమంగా వెళ్లండి.. అమ్మానాన్న ఎదురుచూస్తుంటారు. సైలెన్సర్లు తీసేయకండి . మన ఆనందం ఇంకొకరికి ఇబ్బంది కలిగించొద్దు’’ అంటూ యువకార్యకర్తలకు పవన్ హితవు పలికారు.

0 Comments