ADS

header ads

తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ అన్ని రికార్డులను తిరగరాసింది. హిందీ సినిమా చరిత్రలో తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవలం హిందీ వర్షెనే తొలి రోజు రూ.50.75 కోట్లు వసూలు చేయగా.. తెలుగు, తమిళ్ వర్షెన్లు కలిపితే ఈ మొత్తం రూ.52.25 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పారు. దివాలీ హాలిడే, సినిమా రిలీజ్‌కు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ కావడం, రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవడం ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డుకు కలిసొచ్చిందని ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఏ హిందీ మూవీ కూడా తొలి రోజు రూ.50 కోట్ల వసూళ్లు సాధించలేదు.

Post a Comment

0 Comments