News Hunter : ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం.. చెత్త వేయడం.. సర్కారు సరిగా పట్టించుకోవడం లేదంటూ నిందలు వేయడం.. ముందు ఓ పౌరుడిగా ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తే సగాని పైగా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆ పని చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా పెడన చెవిన పెడుతుంటారు.
అందుకే ఫైన్‌ల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. పట్టుబడినప్పుడు చూసుకుందాంలే అని దాన్ని కూడా పట్టించుకోరు కొంత మంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓ కొత్త రూల్ పాస్ చేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తే భారీగా జరిమానా విధిస్తామంటోంది.
ఇలా చేస్తూ పట్టుబడితే రూ. 5 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫైన్ వసూలు చేసేలా కొత్త బిల్లును తీసుకు వచ్చింది ప్రభుత్వం. కోల్‌కతా రోడ్లను శుభ్రంగా ఉంచడమే ఈ ఫైన్ల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. సీఎం మమతా బెనర్జీ ఇటీవల దక్షిణేశ్వర్ జీ స్కైవాక్‌ను సందర్శించారు.
పాన్ మరకలతో అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఉమ్మివేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప పద్ధతి మార్చుకోరనే నిర్ణయంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు. గతంలో ఇలా ఉమ్మి వేసే వారివద్దనుండి యాభైనుంచి ఐదువేల వరకు వసూలు చేసేవారు. ఇప్పుడది ఏకంగా లక్షరూపాయలు చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు.

0 Comments