ADS

header ads

నెటిజన్లపై మండిపడ్డ జబర్దస్త్ అవినాష్.. టార్చర్ ఆపకపోతే..సూసైడ్ చేసుకుంటా

News Hunter : జబర్దస్త్ అవినాష్ నెటిజన్లపై మండిపడ్డాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటులలో ముక్కు అవినాష్‌ ఒకరు. ఇటీవల అవినాష్ చేసిన ఓ స్కిట్ వివాదాస్పదమైంది. ఆయన చేసిన ఆ స్కిట్‌పై  జగిత్యాల  ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు. అయినా నెటిజన్లు వదిలిపెట్టలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. తాను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణలు చెప్పానన్నాడు. అయినా వినిపించుకోకుండా.. సోషల్ మీడియాలో తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మను, వదినను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు.
ఈ టార్చర్‌ను తాను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా.. ఈ టార్చర్ ఆపకపోతే.. తాను సూసైడ్ చేసుకోవలసి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు శత్రువులు ఎవ్వరూ లేరని.. ఎవరో చెప్తే తాము చేయట్లేదన్నాడు.

Post a Comment

0 Comments