News Hunter ప్రధాని మోదీ, టీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఒక్కటేనని ఆరోపించారు. మోదీకి అవసరమైనప్పుడు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని, మోదీ మైనార్టీ, దళిత, గిరిజన వ్యతిరేకి అంటూ నిప్పులు చెరిగారు. అలాంటి మోదీని సమర్ధించే కేసీఆర్‌ను ఏమనాలి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అంటూ నిప్పులు చెరిగారు. అటు ఎంఐఎం.. ఇటు టీఆర్‌ఎస్ ఇద్దరూ బీజేపీకే మద్దతిస్తున్నారని ఆరోపించారు. ముగ్గురిని మూకుమ్మడిగా ఓడిస్తేనే దేశానికి విముక్తి కలుగుతుందన్నారు.
భూసేకరణ చట్ట సవరణను కేసీఆర్ సమర్ధించారని, ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలను ప్రశ్నించానని. కేసీఆర్ ఆదేశంతోనే మోదీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారని రాహుల్ తెలిపారు. రాఫెల్ స్కాంపై తమతో కేసీఆర్ ఎందుకు కలిసి రాలేదని, మోదీని ఎప్పుడైనా కేసీఆర్ విమర్శించారా అని నిలదీశారు. ఎప్పుడూ మాట్లాడరు.. ఎందుకంటే వారిద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో కేసీఆర్‌కు.ఢిల్లీలో మోదీకి ఓటమి తప్పదని రాహుల్ హెచ్చరించారు.

0 Comments