ADS

header ads

ఈ దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇంజనీర్‌ కావొద్దు.. చండీగఢ్‌ హైకోర్ట్

News Hunter : "ఒకటే జననం ఒకటే మరణం.. గెలుపు పొందెవరకు అలుపు లేదు మనకు" అంటూ సాగే ఓ సినిమా పాటను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ను పూర్తి చేసేందుకు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నాడు ఓ విద్యార్థి. చివరకు పరీక్షలు రాసేందుకు కళాశాల అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. విచారణలో మనోడి చరిత్ర చూసిన సీజే సైతం అవాక్కయ్యారు. ‘ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇంజనీర్‌ కావొద్దు’ అని సలహా ఇచ్చారు. 2009లో ఓ విద్యార్థి చండీగఢ్‌లోని కురుక్షేత్ర నిట్‌లో చేరాడు. నాలుగేళ్లు పూర్తయ్యే సరికి 17 బ్యాక్‌లాగ్స్‌ మిగిలాయి. అతనికి కళాశాల మరో నాలుగేళ్ల సమయమిచ్చింది.
అయినా పాస్‌ కాకపోవడంతో పరీక్షలకు అనుమతించలేదు. దీంతో చండీగఢ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ సందర్భంగా సదరు విద్యార్థి చరిత్ర చూసిన సీజే కృష్ణ మురారి అవాక్కయ్యారు. ‘బాబూ.. ఈ దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇంజనీర్‌ కావొద్దు. సప్లిమెంటరీ పరీక్షలు రాయొద్దు. మరేదైనా కోర్సు చదువుకో’ అని సలహా ఇచ్చారు. ఈ దేశంపై కాస్త దయచూపు నాయనా. ఇంజనీరింగ్‌ మాత్రం కావొద్దని సూచించారు. మరో చాన్సిచ్చి తనపై దయ చూపాల్సిందిగా విద్యార్థి కోరగా, కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని సీజే చీవాట్లు పెట్టారు. తొమిదేళ్లలో 17 సబ్జెక్టులు పాస్‌కాలేనప్పుడు ఒకే చాన్స్‌లో ఎలా పాసవుతావని ప్రశ్నించారు. ఇంజనీరింగ్‌ కోర్సు వదిలి మరో వృత్తిని ఎంచుకోవాల్సిందిగా సీజే సూచించారు.

Post a Comment

0 Comments