News Hunter : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రోత్సహించేందుకు మధ్య ప్రదేశ్ రెస్టారెంట్లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి తమ రెస్టారెంట్‌లో రెండు రోజుల పాటు 10 శాతం రాయితీ ఇస్తామని భోపాల్‌లో ఓ రెస్టారెంట్ ప్రకటించింది. '' మీ ఓటుకు లెక్క ఉంది. మీ ఓటు మార్కు చూపించి, మా వద్ద రెండు రోజుల పాటు 10 శాతం డిస్కౌంట్ పొందండి..'' అంటూ రెస్టారెంటు ముందు బోర్డు పెట్టారు.
కాగా బార్బర్ షాపు నడుపుతున్న సతీశ్ చౌహాన్ అనే వ్యక్తి కూడా వినూత్న రీతిలో ఓటర్లను ప్రోత్సహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఓటు వేసిన వారికి తన షాపులో ఉచిత సేవలు అందిస్తున్నాడు. ఓటర్లు తమ చేతివేలుపై ఇంక్ మార్కు చూపిస్తే చాలు.. ఉచితంగా షేవింగ్ చేస్తున్నాడు. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటావని అడిగితే... ''దేశ ప్రగతి మార్గంలో పయనించడమే నా అసలు లక్ష్యం..'' అంటూ సమాధానం చెప్పాడు.
అతడు చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం కొంతమంది ఓటర్లను ప్రోత్సహించినా.. మంచి పౌరుడిగా అతడి లక్ష్యం నెరవేరినట్టే.
అతడు చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం కొంతమంది ఓటర్లను ప్రోత్సహించినా.. మంచి పౌరుడిగా అతడి లక్ష్యం నెరవేరినట్టే.

0 Comments