ప్రేమ జంటను అనుసరించిన ఇద్దరు యువకులు ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో విన్న బాటసారులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని బలరామ కృష్ణాపురం సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట స్కూటీపై నామ్‌రోడ్డులో కొంగపాడుడొంక నుంచి బలరామకృష్ణాపురం వెళ్లే మట్టిరోడ్డు పక్కన ఉన్న సుబాబుల్ తోటల్లోకి వెళ్లారు. ఇది గమనించిన ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వారిని అనుసరించారు. ప్రియుడిని చెట్టుకు కట్టివేసి యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో బలరామకృష్ణపురం వైపు వెళ్తున్న వ్యక్తులు గమనించి అక్కడకు చేరుకోవ డంతో యువకులు పరారయ్యారు. ఈ విషయమై పోలీసుల కు ఎటువంటి ఫిర్యాదు అందకపోగా, గ్రామంలో మాత్రం చర్చనీయాంశమైంది.

0 Comments