ADS

header ads

మరో రెండు రోజుల్లో తుఫాను హెచ్చరిక..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్ గా మారింది. శ్రీహరి కోటకు తూర్పున 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. తుపాను ప్రభావం ఈనెల 14 నుంచి 17 వరకు ఉంటుందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 15న తమిళనాడులో తుపాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. దక్షిణ చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో తుపాను కదులుతున్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. అదేవిధంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Post a Comment

0 Comments