దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ మల్టీ టాలెంట్ పర్సన్..ఓ పక్క తన తండ్రి తెరకెక్కించే సినిమాలకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ మరోవైపు నిర్మాణ రంగం వైపు కూడా అడుగులేస్తుంటాడు.. ఇటీవలే నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించి మరో బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు అంతకన్నా పెద్ద బాధ్యత తీసుకోబోతున్నాడు.
ఇటీవల (సెప్టెంబర్ 5) న జగపతి బాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్త్ పూజా ప్రసాద్‌తో నిశ్చితార్ధం జరగగా, తాజాగా వీరి వివాహ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. కార్తికేయ, పూజాల వివాహం జనవరి 5, 2019న రామానాయుడు స్టూడియాస్‌లో జరగనున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 6.30ని.లకి ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టు సమాచారం. పూజా ప్రసాద్ భక్తి గీతాలని ఆలపించే గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.

0 Comments