News Hunter : ఇదో విచిత్రమైన ఘటన. ఇది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో చోటు చేసుకున్నది. ఓ దొంగ ఓ ఫ్లాట్‌లో దూరి.. ఆ ఫ్లాట్‌లో ఉండే ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ దొంగలించాడు. కాకపోతే మనోడు అందరు దొంగల్లా కాదు..కాస్త మానవత్వం ఉన్న దొంగ. అందుకే.. ఆ వ్యక్తి ల్యాప్‌టాప్‌ను దొంగలించాడు కానీ.. అతడి ఫోన్, వాలెట్‌ను మాత్రం ముట్టుకోలేదు. అయితే.. ఇది అక్కడితో ముగిసిపోలేదు. ఆ దొంగ ఏం చేశాడంటే.. ఆ ల్యాప్‌టాప్ ఓనర్‌కు ఓ మెయిల్ పంపించాడు. ఏమనీ అంటే.. హల్లో.. నీ ల్యాప్‌టాప్‌ను దొంగలించినందుకు సారీ. నేను చాలా పేదోడిని. నాకు డబ్బుల అవసరం ఉంది. అందుకే నీ ల్యాప్‌టాప్‌ను దొంగలించా. నీ ఫోన్, వాలెట్ అక్కడే ఉంది. నువ్వు యూనివర్సిటీ స్టూడెంట్‌వనుకుంటా. ఈ ల్యాప్‌టాప్‌లో నీ స్టడీకి సంబంధించిన ఏవైనా ఫైల్స్ ఉంటే చెప్పు... నీకు మెయిల్ చేస్తా.. మరోసారి సారీ.. అంటూ మెయిల్ పంపించాడు.
ఈ మెయిల్‌ను ల్యాప్‌టాప్ ఓనర్ ఫ్రెండ్ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. నా రూమ్‌మేట్ ల్యాప్‌టాప్‌ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ దొంగ తర్వాత ఏమని మెయిల్ చేశాడో చూడండి అంటూ ట్వీటాడు. అంతే ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ దొంగ మీద జోకులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మెయిల్ చివర్లో యువర్స్ థీఫ్లీ.. అని రాసి దొంగ సంతకం పెట్టాల్సింది.అంటూ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు.

0 Comments