ADS

header ads

ఢిల్లీలో రైతులు పాదయాత్ర.. అడ్డుకుంటే నగ్న ప్రదర్శన

News Hunter :అన్నదాతల ఆందోళనతో ఢిల్లీ వేడెక్కింది. డిమాండ్ల సాధనకు దేశ రాజధాని నడిబొడ్డున గళమెత్తారు రైతులు. గురువారం నుంచి రెండు రోజుల పాటు తలపెట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది.
అందులోభాగంగా రాంలీలా మైదాన్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయితే పాదయాత్ర అడ్డుకుంటే నగ్న ప్రదర్శనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
రైతాంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రెండు రోజుల ఆందోళనకు శ్రీకారం చుట్టారు రైతులు. అఖిల భారత రైతు ఉద్యమ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు లక్షమంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు.
దేశానికి అన్నం పెట్టే తమను పట్టించుకోకపోవడం దారుణమంటూ నిరసనకు దిగారు. రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. మోడీ ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు.

Post a Comment

0 Comments