బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిలను కలిశారు. మోడీ ప్రభుత్వానికి, ఎన్డీయేకు వ్యతిరేకంగా చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఆయన గురువారం బెంగళూరులో దిగారు. దేవేగౌడను, కుమారస్వామిని కలిశారు. చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కంభంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు.
రెండు రోజుల క్రితమే కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. మూడు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే, ఇందులో అంతకుముందు రెండు బీజేపీ స్థానాలు కాగా, కాంగ్రెస్ - జేడీఎస్ కూటమివి మూడు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి కోల్పోయింది. పైగా ఇక్కడ కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇదేం అతిపెద్ద షాక్ కాదని చెబుతున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ అంటున్నారు. ఫలితాలు వచ్చిన రెండ్రోజుల్లో చంద్రబాబు బెంగళూరుకు రావడంగమనార్హం.

0 Comments