ADS

header ads

టీఆర్ఎస్‌కు షాక్ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల రాజీనామా

News Huntr :  కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు టీఆర్ఎస్‌కు ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణవాదం.. అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయారని, మీలో మార్పురాకపోగా పార్టీ పక్కదారులు పడుతోందంటూ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఓ ఇల్లులా భావించి మిమ్మల్ని(కేసీఆర్) ఇంటికి పెద్ద దిక్కుగా భావించి ఇన్నాళ్లు పార్టీలో ఉన్న చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికగా సహించామంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా... ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు గొట్టిముక్కల రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర చర్చానీయాంశమవుతోంది. కేటీఆర్‌కు అనుచరుడిగా ఉన్న గొట్టిముక్కల పార్టీకి రాజీనామా చేయడం కూకట్‌పల్లి నియోజకవర్గంలో కొంత నష్టమేనని పలువురు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments